‘సాగు చట్టాలు రద్దు చేయబోం’

న్యూఢిల్లీ: మూడు నూతన సాగు చట్టాలను ఎట్టిపరిస్థితుల్లో రద్దు చేయబోమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఇతర అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రైతులకు తెలియజేశారు. అందుకే రైతులు తమ ఆందోళనను విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతు నేతలు 11 సార్లు చర్చలు జరిపారు. కానీ, ఫలితం తేలలేదు. జనవరి 26న రైతుల మార్చ్ హింసాత్మకం కావడంతో చర్చలు మళ్లీ ముందుకు రాలేదు. తాజాగా, […]

Update: 2021-07-08 10:00 GMT

న్యూఢిల్లీ: మూడు నూతన సాగు చట్టాలను ఎట్టిపరిస్థితుల్లో రద్దు చేయబోమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఇతర అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రైతులకు తెలియజేశారు. అందుకే రైతులు తమ ఆందోళనను విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతు నేతలు 11 సార్లు చర్చలు జరిపారు. కానీ, ఫలితం తేలలేదు. జనవరి 26న రైతుల మార్చ్ హింసాత్మకం కావడంతో చర్చలు మళ్లీ ముందుకు రాలేదు.

తాజాగా, కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మరోసారి చర్చలకు ఆహ్వానించారు. వ్యవసాయ మండీలను తాము కొనసాగిస్తామని, వాటిని బలోపేతం చేయడానికి నిధులనూ కేటాయించనున్నట్టు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కింద రైతు మౌలిక వసతుల నిధికి విడుదల చేసే రూ. 1 లక్ష కోట్లను ఏపీఎంసీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని, ఇది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News