ఇన్నోవేషన్ ఆవిష్కరణలో జిల్లా విద్యార్థిని ఎంపిక

దిశ, కామారెడ్డి : ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలో కామారెడ్డి జిల్లా నుండి మాచారెడ్డి మండలం ఇసాయిపేట జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని బి.స్పందన ఎంపికైనట్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరామిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలలో ఆన్లైన్లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహించడం జరిగిందని, ప్రదర్శనలో విద్యార్థిని స్పందన తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తుతో రూపొందించిన గిన్నెలు శుభ్రం చేసే డిష్ వాషర్ రబ్బర్ ఆవిష్కరణ ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. […]

Update: 2021-08-13 10:49 GMT

దిశ, కామారెడ్డి : ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణలో కామారెడ్డి జిల్లా నుండి మాచారెడ్డి మండలం ఇసాయిపేట జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని బి.స్పందన ఎంపికైనట్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరామిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలలో ఆన్లైన్లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహించడం జరిగిందని, ప్రదర్శనలో విద్యార్థిని స్పందన తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్తుతో రూపొందించిన గిన్నెలు శుభ్రం చేసే డిష్ వాషర్ రబ్బర్ ఆవిష్కరణ ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్పందన ఆవిష్కరణను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులలో ప్రతిభను వెలికితీయడానికి ఇంటింటా ఇన్నోవేషన్ ఒక మంచి వేదిక అని చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు తమలోని సృజనాత్మకతను ఇలాంటి వేదికల ద్వారా మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News