ఒక్క రోజులో 4 లక్షల డోసులు పంపిణీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతమైనది. 18 ఏళ్లు పై బడిన వారి కోసం వైద్యాధికారులు గ్రామాల్లో గాలిస్తున్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకోని వారిని గుర్తించి, దాని ఆవశ్యకతను వివరించి ఎక్కడికక్కడే డోసులు ఇస్తున్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ కు ఆరోగ్యశాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి తొలి రోజు అద్భుతమైన ఆదరణ లభించింది. ఒక్క రోజులోనే ఏకంగా 4.1 లక్షల మందికి డోసులు ఇచ్చిన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇప్పటి వరకు జరిగిన పంపిణీలో ఇదే […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతమైనది. 18 ఏళ్లు పై బడిన వారి కోసం వైద్యాధికారులు గ్రామాల్లో గాలిస్తున్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకోని వారిని గుర్తించి, దాని ఆవశ్యకతను వివరించి ఎక్కడికక్కడే డోసులు ఇస్తున్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ కు ఆరోగ్యశాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి తొలి రోజు అద్భుతమైన ఆదరణ లభించింది. ఒక్క రోజులోనే ఏకంగా 4.1 లక్షల మందికి డోసులు ఇచ్చిన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఇప్పటి వరకు జరిగిన పంపిణీలో ఇదే గరిష్ఠం కావడం గమనార్హం.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫోకస్ పెట్టారు. ప్రతీ ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకొని వారిని గుర్తించి టీకాలు పంపిణీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. ఈ మేరకు స్థానిక మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు, అంగన్ వాడీలు, రెవెన్యూ సిబ్బంది, ఆశాలు, ఏఎన్ఎంలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి పీహెచ్ సీల పరిధిలోని ప్రతీ గ్రామానికి వెళ్తున్నారు.
విస్తృతంగా అవగాహన..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 52 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ పొందారు. మరో 48 శాతం మందికి ఈనెలాఖరు వరకు కనీసం ఒక్క డోసునైనా ఇవ్వాలని ఆరోగ్యశాఖ టార్గెట్ పెట్టుకున్నది. దీంతో ప్రతీ గ్రామంలో వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ డోసులు పంపిణీ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే స్థానిక అధికారులు పంటపోలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలకూ అవగాహన కల్పించడం గమనార్హం.
ఇప్పటి వరకు జరిగిన టీకా పంపిణీ ఇలా..
కేటగిరి డోసు1 డోసు2
హెల్త్‌కేర్ 3,04,240 2,33,609
ఫ్రంట్‌లైన్ 3,16,919 2,22,665
18–44 78,37,349 18,73,917
45పైబడి 63,37,619 33,42,608
మొత్తం 1,47,96,127 56,72,799