ఆదాయం పెరిగిందని ధరను పెంచుతారా?

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరు నెలలు ఆలస్యంగా యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించారు. ఖాళీ స్టేడియంలలో నిర్వహించిన ఈ లీగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇండియాలో స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం చేయగా వీక్షకులు గణనీయంగా పెరిగారు. బార్క్ రేటింగ్స్ ప్రకారం ఐపీఎల్ 13వ సీజన్ 7 బిలియన్ నిమిషాల వ్యూవర్‌షిప్ సాధించింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో 28 శాతం వీక్షకుల సంఖ్య పెరిగింది. […]

Update: 2020-11-12 07:25 GMT

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరు నెలలు ఆలస్యంగా యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించారు. ఖాళీ స్టేడియంలలో నిర్వహించిన ఈ లీగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇండియాలో స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం చేయగా వీక్షకులు గణనీయంగా పెరిగారు. బార్క్ రేటింగ్స్ ప్రకారం ఐపీఎల్ 13వ సీజన్ 7 బిలియన్ నిమిషాల వ్యూవర్‌షిప్ సాధించింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో 28 శాతం వీక్షకుల సంఖ్య పెరిగింది. వీక్షకుల సంఖ్య పెరగడంతో బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా ఆదాయం కూడా పెరిగినట్లు తెలుస్తున్నది.

ఈ సీజన్ మొత్తానికి కలిపి దాదాపు రూ. 2450 కోట్ల రూపాయల ఆదాయం అర్జించినట్లు సమాచారం. స్టార్ టీవీ ద్వారా రూ. 2250, హాట్ స్టార్ ద్వారా రూ. 200 కోట్లు యాడ్స్ రూపంలో ఆదాయం వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది స్పాన్సర్లు కూడా పెరిగారని.. 6 నెలలుగా ఎటువంటి లైవ్ క్రికెట్ లేకపోవడంతో వీక్షకులు పెరిగారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి వీక్షకుల సంఖ్య పెరగడంతో వచ్చే సీజన్‌కు యాడ్స్ ధరను పెంచే యోచనలో స్టార్ ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News