దిశ ఎఫెక్ట్.. ఆస్పత్రిలో నూతన డైట్ స్టార్ట్

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదానగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన డైట్ ను కాంట్రాక్టర్ తిరుమలేశ్ ప్రారంభించారు. ఆస్పత్రిలో డెలివరీ అయిన పేషెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్ ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేషెంట్లకు అందించే ఆహారంలో జెర్రీ పురుగు రావడంతో “దిశ” దినపత్రికలో పేషెంట్లకు అందించే ఆహారంలో ‘జెర్రీ పురుగు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టి పాత కాంట్రాక్టర్ విజయ్ […]

Update: 2021-12-28 07:48 GMT

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదానగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన డైట్ ను కాంట్రాక్టర్ తిరుమలేశ్ ప్రారంభించారు. ఆస్పత్రిలో డెలివరీ అయిన పేషెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్ ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేషెంట్లకు అందించే ఆహారంలో జెర్రీ పురుగు రావడంతో “దిశ” దినపత్రికలో పేషెంట్లకు అందించే ఆహారంలో ‘జెర్రీ పురుగు’ అనే కథనం ప్రచురితం కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టి పాత కాంట్రాక్టర్ విజయ్ కుమార్ ను తొలగించారు. దీంతో నూతన కాంట్రాక్టర్ మంగళవారం నూతన డైట్ ను ప్రారంభించారు.

Tags:    

Similar News