హర్యానా అడవుల్లో లక్ష ఏళ్ల కిందటి పెయింటింగ్స్

దిశ, ఫీచర్స్ : ఫరీదాబాద్‌లోని మంగర్ బనీ హిల్ ఫారెస్ట్‌లో గల ప్రీహిస్టారిక్ సైట్‌లో ఇటీవలే కనుగొన్న కేవ్(గుహ) పెయింటింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇవి దాదాపు లక్ష ఏళ్లు పురాతనమైనవిగా హర్యానాలోని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. టూల్ టోపాలజీ ఆధారంగా.. ఈ ప్రదేశంలో లభించిన చరిత్రను లెక్కగట్టగా, మరో కాలానికి(క్రీ.శ. 8-9వ శతాబ్దం) సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నట్టు హర్యానా ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ బనాని భట్టాచార్య తెలిపారు. భారత […]

Update: 2021-07-17 01:45 GMT

దిశ, ఫీచర్స్ : ఫరీదాబాద్‌లోని మంగర్ బనీ హిల్ ఫారెస్ట్‌లో గల ప్రీహిస్టారిక్ సైట్‌లో ఇటీవలే కనుగొన్న కేవ్(గుహ) పెయింటింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇవి దాదాపు లక్ష ఏళ్లు పురాతనమైనవిగా హర్యానాలోని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. టూల్ టోపాలజీ ఆధారంగా.. ఈ ప్రదేశంలో లభించిన చరిత్రను లెక్కగట్టగా, మరో కాలానికి(క్రీ.శ. 8-9వ శతాబ్దం) సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నట్టు హర్యానా ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ బనాని భట్టాచార్య తెలిపారు.

భారత ఉపఖండంలోనే రాతియుగ ఆనవాళ్లు కలిగిన అతిపెద్ద ప్రదేశం ఇదే కాగా.. ఇక్కడి పలు బహిరంగ ప్రదేశాలు, రాక్ షెల్టర్స్ నుంచి పురాతన రాతి పనిముట్లను సేకరించారు. ఈ ఏడాది మే నెలలో ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ సునీల్ హర్సానాకు మంగర్ బనీ హిల్ ఫారెస్ట్‌లో పూర్వపుచరిత్రకు చెందిన కేవ్ పెయింటింగ్ లభించింది. దీంతో హర్యానా పురావస్తు శాఖ ఫరీదాబాద్‌లోని శిలాఖరి, మంగర్, కోట్, ధౌజ్ ప్రాంతాలతో పాటు గుర్గావ్‌లోని రోజ్ కా గుజ్జర్, దమ్దామాలో అన్వేషణలు జరిపింది. అయితే ఇక్కడున్న పాత గుహల్లోని చిత్రాల గురించి తమకు ముందే తెలిసినా, వాటికి అంత ప్రాముఖ్యత ఉందనుకోలేదని సునీల్ హర్సానా తెలిపారు. వన్యప్రాణుల నుంచి వృక్షసంపద వరకు ఆరావళి పర్వతాలకు చెందిన వివిధ అంశాలతో పాటు ఇక్కడి గుహల్లోని ఆర్ట్స్‌ను హర్సానా డాక్యుమెంట్ చేస్తున్న ఆయన.. లాక్‌డౌన్ టైమ్‌లో వీటికి సంబంధించిన డ్రాయింగ్స్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో అవి పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయని ఆయన తెలిపారు.

‘ఈ గుహలు ఉన్న ప్రదేశానికి చేరుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పర్వతాలను ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడికి సులభంగా వచ్చే మార్గం లేకపోవడంతోనే ఈ గుహలు ఇప్పటికీ పరిరక్షించబడ్డాయి. కొన్ని గుహల్లో రాతిచిత్రాలు ఉండగా, మిగతావి పెయింటింగ్స్. అయితే ఇందులో కొన్ని మాత్రమే మంచి స్థితిలో ఉండగా.. వాటిపై ఉన్న చిహ్నాలు, గుర్తులు దేనికి సంబంధించినవనేది పురావస్తు విభాగం మాత్రమే చెప్పగలుగుతుంది’ అని హర్సానీ చెప్పారు.

కాగా ప్రొటెక్టెడ్ జోన్‌లో లేని మంగర్ బాని అడవులకు ‘పురాతన, చారిత్రక కట్టడాలు & పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1964 కింద రక్షణ కల్పిస్తామని హర్యానా ప్రిన్సిపల్ సెక్రెటరీ అశోక్ ఖేమ్కా ప్రకటించారు. ఈ ప్రదేశంలో కేవ్ పెయింటింగ్స్‌, రాతియుగంనాటి పనిముట్లు పెద్ద ఎత్తున ఉన్నందున స్టేట్ ప్రొటెక్షన్ ఇస్తామంటున్నారు అశోక్.

Tags:    

Similar News