‘ఇతర హీరోలతో పోలీస్తే.. పవన్ పవర్ ఫుల్’

దిశ, వెబ్ డెస్క్: డెరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనంగా మారడం ఖాయం. దాదాపు ఆయన చేసే సినిమాలు మొత్తం వివాదాలు చుట్టూ తిరుగుతుంటాయి. ఇప్పటికే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని తాజా రాజకీయంపై సినిమా తీసి, ఏపీ రాజకీయాల్లో చిచ్చుపెట్టాడు. కాగా తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తూ, మరోసారి సంచలనంగా మారాడు. ‘పవర్‌ స్టార్‌’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా స్టిల్‌‌ను అభిమానులతో పంచుకున్నారు. […]

Update: 2020-07-14 12:18 GMT

దిశ, వెబ్ డెస్క్: డెరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనంగా మారడం ఖాయం. దాదాపు ఆయన చేసే సినిమాలు మొత్తం వివాదాలు చుట్టూ తిరుగుతుంటాయి. ఇప్పటికే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని తాజా రాజకీయంపై సినిమా తీసి, ఏపీ రాజకీయాల్లో చిచ్చుపెట్టాడు. కాగా తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తూ, మరోసారి సంచలనంగా మారాడు. ‘పవర్‌ స్టార్‌’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా స్టిల్‌‌ను అభిమానులతో పంచుకున్నారు. అంతేగాకుండా తన హీరో ప్రవన్‌కల్యాణ్‌ అద్భుతమైన నటుడని, ఇతర స్టార్‌లతో పోలిస్తే ఎంతో పవర్‌ఫుల్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే సినిమా విడుదల తేదీని తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక పోస్టర్లు విడుదల చేసిన ఆర్జీవీ సోషల్‌ మీడియాలో ఎప్పటికపుడు సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత, మారుతీరావుల కథ ఆధారంగా ‘మర్డర్’, ‘కరోనా వైరస్‌’, ‘ది మ్యాన్‌ హూ కిల్డ్‌ గాంధీ’, ‘కిడ్నాప్‌ ఆఫ్‌ కత్రినా కైఫ్‌’ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. లాంటి పలు చిత్రాలకు సంబంధించిన షూటింగ్ చిత్రీకరిస్తున్నారు.

Tags:    

Similar News