పోలీస్ స్టోరీస్ తీసినందుకు సిగ్గుపడుతున్నా: హరి

తమిళనాడు ట్యుటికోరిన్ ఘటనలో ఖాకీల కర్కశత్వానికి తండ్రీకొడుకులు జయరాజ్, ఫెనిక్స్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, సింగర్ సుచిత్ర షేర్ చేసిన వీడియోతో ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. లాకప్‌లో పోలీసులు చూపించిన నరకానికి ఇద్దరు చనిపోగా.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సినీ ప్రముఖులు, సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ హరి కూడా ఈ విషయంపై స్పందించారు. పోలీస్ ఆఫీసర్ గొప్పతనాన్ని చాటి చెప్తూ సింగం, సింగం 2, సింగం […]

Update: 2020-06-28 08:00 GMT

తమిళనాడు ట్యుటికోరిన్ ఘటనలో ఖాకీల కర్కశత్వానికి తండ్రీకొడుకులు జయరాజ్, ఫెనిక్స్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, సింగర్ సుచిత్ర షేర్ చేసిన వీడియోతో ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. లాకప్‌లో పోలీసులు చూపించిన నరకానికి ఇద్దరు చనిపోగా.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సినీ ప్రముఖులు, సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో డైరెక్టర్ హరి కూడా ఈ విషయంపై స్పందించారు. పోలీస్ ఆఫీసర్ గొప్పతనాన్ని చాటి చెప్తూ సింగం, సింగం 2, సింగం 3, సామి, సామి సీక్వెల్ సినిమాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. ఈ చిత్రాలు తీసినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. ఇలాంటి కొందరు పోలీసులు చేసిన చర్యలు మొత్తం పోలీస్ యంత్రాంగానికి చెడ్డ పేరు తెచ్చిపెడతాయని అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు హరి.

Tags:    

Similar News