వికారాబాద్ కల్తీ కల్లు కేసులో కొత్తకోణం..
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 350 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, కల్తీ కల్లుకు సంబంధించిన రిపోర్టులను ల్యాబోరేటరీ వారు ప్రభుత్వానికి అందజేశారు. కల్లులో అధిక మోతాదులో డైజోఫామ్ కలిపినట్లు తేలింది. అందువల్లే దాన్ని తాగిన వారు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడం, పిచ్చిపట్టినట్లుగా వ్యవహరించినట్లు అందులో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే చిట్టిగద్ద కల్లు డిపోను […]
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 350 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, కల్తీ కల్లుకు సంబంధించిన రిపోర్టులను ల్యాబోరేటరీ వారు ప్రభుత్వానికి అందజేశారు.
కల్లులో అధిక మోతాదులో డైజోఫామ్ కలిపినట్లు తేలింది. అందువల్లే దాన్ని తాగిన వారు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడం, పిచ్చిపట్టినట్లుగా వ్యవహరించినట్లు అందులో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే చిట్టిగద్ద కల్లు డిపోను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా వేర్వేరు చోట్ల 12కు పైగా కల్లు డిపోలను మూసివేయించారు.