డీజిల్ రేట్ రూ.8 తగ్గింపు.. ?

దిశ, వెబ్‌డెస్క్: ఇంధన వనరులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏకంగా డీజిల్ ధర రూ. 8 వరకు తగ్గనుంది. దీనిపై కేంద్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలపడంతో రేపటి నుంచే తగ్గించిన ధరలు అమలులోకి రానున్నాయి. కరోనా ప్రభావంతో దేశంలో పెట్రోల్‌తో పాటు.. డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకీ పెట్రోల్‌-డిజీల్ ధరలు పెరుగుతూ […]

Update: 2020-07-30 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంధన వనరులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏకంగా డీజిల్ ధర రూ. 8 వరకు తగ్గనుంది. దీనిపై కేంద్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలపడంతో రేపటి నుంచే తగ్గించిన ధరలు అమలులోకి రానున్నాయి.

కరోనా ప్రభావంతో దేశంలో పెట్రోల్‌తో పాటు.. డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకీ పెట్రోల్‌-డిజీల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. అటు ఢిల్లీలో ప్రస్తుతం డీజిల్ ధర 81.94 ఉండగా.. తాజా ధరలతో 73.94కు దిగిరానుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త ఇచ్చిందని డీజిల్ వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Tags:    

Similar News