ఆ రాష్ట్రాన్ని వణికిస్తున్న మరో వ్యాధి.. ఒక్కరోజులోనే 100 మంది పిల్లలు..
చండీఘడ్ : హర్యానాలో డయేరియా విజృంభించింది. పంచకులకు చెందిన అభయ్‌పూర్ గ్రామంలో బుధవారం తొలి కేసు రిపోర్ట్ అయింది. తొమ్మిదేళ్ల బాలుడు డయేరియాతో మరణించగా కనీసం 300 మంది దీనితో బాధపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. గురువారం నాటికీ ఈ క్యాంపులలో, జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కనీసం 100 మంది పిల్లలు డయేరియాతో అడ్మిట్ అయ్యారు. మంచినీళ్ల పైపులోకి మురుగు నీరు చేరి కలుషితం కావడం మూలంగా ఈ కేసులు రిపోర్ట్ అవుతున్నట్టు […]
చండీఘడ్ : హర్యానాలో డయేరియా విజృంభించింది. పంచకులకు చెందిన అభయ్‌పూర్ గ్రామంలో బుధవారం తొలి కేసు రిపోర్ట్ అయింది. తొమ్మిదేళ్ల బాలుడు డయేరియాతో మరణించగా కనీసం 300 మంది దీనితో బాధపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. గురువారం నాటికీ ఈ క్యాంపులలో, జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కనీసం 100 మంది పిల్లలు డయేరియాతో అడ్మిట్ అయ్యారు. మంచినీళ్ల పైపులోకి మురుగు నీరు చేరి కలుషితం కావడం మూలంగా ఈ కేసులు రిపోర్ట్ అవుతున్నట్టు ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. అభయ్‌పూర్‌కు తాగునీరు అందించే ట్యాంకు పక్కనే టాయిలెట్లు ఉన్నట్టు తెలిసిందని, బహుశా భూగర్భజలంలోనే కలుషితకారకాలు మంచినీటిలో చేరి ఉండవచ్చని, ఈ కారణంగా కలరా వ్యాపించి ఉండవచ్చునని పంచకుల సీఎంవో డాక్టర్ ముక్తా కుమార్ గురువారం పేర్కొన్నారు.