అనంతలో వాలంటీర్లకు షాక్.. 267 మందిని తొలగించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వాలంటీర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ 267 మంది గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న వారిని గుర్తించి విధుల నుంచి తొలగించామని స్పష్టం చేశారు. కొంతమంది వాలంటీర్లు అవినీతికి […]
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వాలంటీర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ 267 మంది గ్రామ/ వార్డు సచివాలయ వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న వారిని గుర్తించి విధుల నుంచి తొలగించామని స్పష్టం చేశారు. కొంతమంది వాలంటీర్లు అవినీతికి పాల్పడుతున్నారని మరికొంతమంది ప్రజలకు సేవలు అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపారు. సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.