బైంసాలో లైంగిక దాడి ఘటనపై స్పందించిన డీజీపీ
దిశ, క్రైమ్ బ్యూరో : నిర్మల్ జిల్లా బైంసాలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి అంశంపై జరిగే దర్యాప్తును పర్యవేక్షించాలని పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు. మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి విషయంపై డీజీపీ స్పందించారు. ఈ సంఘటనపై పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని గుర్తించి కోర్టులో ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను శాస్త్రీయ పరంగా గుర్తించి, […]
దిశ, క్రైమ్ బ్యూరో : నిర్మల్ జిల్లా బైంసాలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి అంశంపై జరిగే దర్యాప్తును పర్యవేక్షించాలని పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగాన్ని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు. మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి విషయంపై డీజీపీ స్పందించారు. ఈ సంఘటనపై పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని గుర్తించి కోర్టులో ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను శాస్త్రీయ పరంగా గుర్తించి, నిందితుడికి తగు శిక్ష పడేవిధంగా దర్యాప్తు ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మహిళా భద్రతా విభాగాన్ని ఆదేశించారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న డీజీపీ దర్యాప్తును నిస్పాక్షికంగా, త్వరిత గతిన పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. బాధిత బాలికకు వైద్య సహాయం అందించడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు తగు ఆర్థిక సహాయాన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో మహిళా భద్రతా విభాగం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుందని ఒక ప్రకటనలో డీజీపీ తెలిపారు.