పోలవరం ఎప్పటిదో తెలుసా..?

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదని.. 1940లోనే మొదలైందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు కోసం అనేక సార్లు ఢిల్లీ వెళ్లామని ఆయన గుర్తు చేశారు. కానీ, వైసీపీ నేతలు అనేక సార్లు అంచనాలు పెంచారని చెప్పారు. టీడీపీ హయాంలోనే పోలవరం నిర్మాణం జరిగిందని దేవినేని తెలిపారు. 2019లో రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలిపారన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను పోలవరం దగ్గరకు తీసుకెళ్లామని.. డీపీఆర్‌-2లో పోలవరం భూసేకరణ, […]

Update: 2020-10-26 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదని.. 1940లోనే మొదలైందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు కోసం అనేక సార్లు ఢిల్లీ వెళ్లామని ఆయన గుర్తు చేశారు. కానీ, వైసీపీ నేతలు అనేక సార్లు అంచనాలు పెంచారని చెప్పారు. టీడీపీ హయాంలోనే పోలవరం నిర్మాణం జరిగిందని దేవినేని తెలిపారు. 2019లో రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలిపారన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను పోలవరం దగ్గరకు తీసుకెళ్లామని.. డీపీఆర్‌-2లో పోలవరం భూసేకరణ, పునరావాసం నిధులు చేర్చినట్టు చెప్పారు. ఈ విషయాలన్నీ కేంద్ర ఆర్థిక శాఖకు తెలిపితే.. నితీన్ గడ్కరీ రెండు సార్లు ప్రాజెక్టును పరిశీలించారన్నారు. కానీ, వైసీపీ నేతలు టీడీపీ పై అసత్య ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.

Tags:    

Similar News