ముందు పాక్‌లో విధ్వంసం…తరువాతే కశ్మీర్

దిశ వెబ్‌డెస్క్: అమెరికా, ఆప్ఘాన్ ఆర్మీకి అప్పగించిన ఆయుధాలు తాలిబన్ల చేతుల్లో పడటంతో భారత్ ఆందోళన చెందుతోంది. తాలిబన్లు ప్రస్తుతం పాకిస్తాన్ అదుపులో ఉండటంతో భవిష్యత్‌లో కశ్మీర్‌ లోయలో వీటిని ప్రయోగించే అవకాశం ఉందని కొంతమంది భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాలిబన్ల మిలిటరీ వ్యవహరాలు చూసే ముల్లా యాకుబ్ పాకిస్తాన్ ఆర్మీ చేతిలో కీలు బొమ్మ కావటంతో న్యూఢిల్లీ ఆందోళన చెందుతోంది. అయితే భారత్ ఆందోళనలను మరికొంతమంది భద్రతా నిపుణులు కొట్టి పారేస్తున్నారు. […]

Update: 2021-08-24 06:49 GMT

దిశ వెబ్‌డెస్క్: అమెరికా, ఆప్ఘాన్ ఆర్మీకి అప్పగించిన ఆయుధాలు తాలిబన్ల చేతుల్లో పడటంతో భారత్ ఆందోళన చెందుతోంది. తాలిబన్లు ప్రస్తుతం పాకిస్తాన్ అదుపులో ఉండటంతో భవిష్యత్‌లో కశ్మీర్‌ లోయలో వీటిని ప్రయోగించే అవకాశం ఉందని కొంతమంది భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాలిబన్ల మిలిటరీ వ్యవహరాలు చూసే ముల్లా యాకుబ్ పాకిస్తాన్ ఆర్మీ చేతిలో కీలు బొమ్మ కావటంతో న్యూఢిల్లీ ఆందోళన చెందుతోంది.

అయితే భారత్ ఆందోళనలను మరికొంతమంది భద్రతా నిపుణులు కొట్టి పారేస్తున్నారు. తాలిబన్ల అదుపులో ఉన్న ఆయుధాలు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో పడితే మొదట అక్కడే విధ్వంసం జరుగుతుందని వీరు అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్‌లో ఉన్న ఉగ్రతండాలపై ఇప్పటికే తమ నియంత్రణ కోల్పొయిన పాక్… మొదటి విధ్వంస ఫలితాన్ని తామే అనుభవిస్తుందని అభిప్రాయపడుతున్నారు.‘ భారత్ కంటే ముందు అమెరికా ఆయుధాలు పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టిస్తాయి. ఆ తరువాతే కశ్మీర్ పై గురి పెడతారు’ అంటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆర్మీ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిణామాలన్ని 1990ల నాటిని గుర్తు చేస్తున్నాయని, కశ్మీర్‌లో అక్కడక్కడా మిగిలి ఉన్న వారిని సంఘటిత పరచి పాకిస్తాన్ తిరిగి కుట్రలు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా, కాబూల్‌లో దాదాపు ఐదు లక్షల ఎం-16, ఎం -04 అసాల్ట్ రైఫిల్లు, లైట్ మెషిన్ గన్లు, 50 కాలిబర్ వెఫన్స్, 2000 ఆధునిక పోరాట వాహనాలు, తొమ్మిది లక్షల బుల్లెట్లు, లైట్ యూఏవీలు, బ్లాక్ హవాక్స్ హెలికాప్టర్లు, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ఉన్నట్లు అంచనా. కాబూల్ ఉన్న హక్కానీ నెట్వర్క్‌కు, పాక్‌లోని ఇతర ఉగ్రవాద బృందాలకు మంచి సంబంధాలున్నాయని భారత నిఘా వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. అయితే వీటిని ఎదుర్కోవడానికి భారత భద్రతా దళాలకు చాలినంత అనుభవం ఉండటంతో భయపడాల్సిన అవసరం లేదని మాజీ సైనిక నిపుణులు భరోసానిస్తున్నారు.

Tags:    

Similar News