ఎంపీ అర్వింద్‌పై ఆ కేసు నమోదు చేయాలి.. సిద్దిపేట సీపీకి ఫిర్యాదు

దిశ, సిద్దిపేట: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.. దళిత-గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెలంగాణ మాల మహానాడు, ఎమ్మార్పీఎస్‌ టీఎస్, తెలంగాణ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధర్మపురి అర్వింద్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవమానించారన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో దళిత గిరిజన సంఘాల […]

Update: 2021-11-02 05:36 GMT

దిశ, సిద్దిపేట: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.. దళిత-గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెలంగాణ మాల మహానాడు, ఎమ్మార్పీఎస్‌ టీఎస్, తెలంగాణ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధర్మపురి అర్వింద్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవమానించారన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అర్వింద్ ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర సెక్రెటరీ జనరల్ కరికె శ్రీనివాస్, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు కేఆర్ భీమసేన, గుర్రాల శ్రీనివాస్, వనం రమేష్, ర్యా‌కం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News