ఢిల్లీ రిటర్న్ సలీం మృతి

దిశ, ఆదిలాబాద్: ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన సలీం శుక్రవారం మృతి చెందాడు. నిర్మల్ జిల్లా చిక్కడపల్లికి చెందిన సలీం(42) గత నెలలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లాడు. అనంతరం నిర్మల్‌కు అందరితోపాటే వచ్చిన ఆయన్ను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడం‌తో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసొలేషన్ వార్డులో చేర్చారు. సలీం ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌కు వెళ్లే మార్గం మధ్యలో డిచ్‌పల్లి సమీపంలో […]

Update: 2020-04-03 08:49 GMT

దిశ, ఆదిలాబాద్: ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన సలీం శుక్రవారం మృతి చెందాడు. నిర్మల్ జిల్లా చిక్కడపల్లికి చెందిన సలీం(42) గత నెలలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లాడు. అనంతరం నిర్మల్‌కు అందరితోపాటే వచ్చిన ఆయన్ను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడం‌తో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసొలేషన్ వార్డులో చేర్చారు. సలీం ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌కు వెళ్లే మార్గం మధ్యలో డిచ్‌పల్లి సమీపంలో అతను మృతి చెందాడు. అయితే అతను కరోనా వల్లే చనిపోయాడని వెల్లడించలేమని డాక్టర్లు తెలిపారు. సలీం చనిపోక ముందే రక్తం శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్ కు పంపించినట్టు జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. రిపోర్టు వస్తే కాని అతడు ఎలా చనిపోయాడనే విషయం చెప్తామని వైద్యులు తెలిపారు.

Tags: delhi return person died, corona, lockdown, markaz

Tags:    

Similar News