వైసీపీ పేరుపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YCP) గుర్తింపు, పేరుపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వైసీపీ తమ పార్టీ పేరును వాడుకుంటోందని, వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగ్గా.. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తప్పుడు ఉద్దేశాలతో పిటిషన్ వేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. వైఎస్సార్ అనే పదం తమకే చెందుతుందని, […]

Update: 2021-06-04 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YCP) గుర్తింపు, పేరుపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వైసీపీ తమ పార్టీ పేరును వాడుకుంటోందని, వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగ్గా.. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తప్పుడు ఉద్దేశాలతో పిటిషన్ వేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

వైఎస్సార్ అనే పదం తమకే చెందుతుందని, వైసీపీ అనేది అన్న వైఎస్సార్ పార్టీలో అంతర్భాగమని అన్న వైఎస్సార్ పార్టీ పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఆ వాదనలో మెరిట్ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా తాము తీసుకున్నామంది. కాగా, వైసీపీ పేరుపై గతంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వైసీపీ వాడుకుంటోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News