రాత్రి 9 గంటల వరకు వ్యాక్సినేషన్ సెంటర్స్..

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట వ్యాక్సినేషన్ సెంటర్లను రాత్రి 9గంటల వరకు తెరచి ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఇదివరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్లు ఓపెన్ చేసి ఉండేవి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను 1000కు పెంచుతున్నట్లు […]

Update: 2021-03-18 09:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట వ్యాక్సినేషన్ సెంటర్లను రాత్రి 9గంటల వరకు తెరచి ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఇదివరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్లు ఓపెన్ చేసి ఉండేవి.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను 1000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఎవరైతే కరోనా టీకా పొందేందుకు అర్హులుగా ఉన్నారో వారంతా వెంటనే టీకా తీసుకోవాలని ఢిల్లీ సీఎం పిలుపునిచ్చారు.

Tags:    

Similar News