గేమ్ ఛేంజర్ ఆ ఒక్క బంతి..
దిశ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ జట్టు మధ్య నిన్న జరిగిన పోరులో అనుహ్యంగా ఢిల్లీ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ సేన గెలవడానికి ‘ఆ ఒక్క బంతే’ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మ్యాచ్ చివరి 19వ ఓవర్‌లో తొలి బంతిని తుషార్ వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతిని తెవాతియా భారీ షాట్ కొట్టాడు. దీంతో సిక్స్ వెళ్లాల్సిన బంతిని బౌండరీ వద్ద అజింక్య రహానే అద్భుతంగా ఆపి మైదానంలోకి విసిరాడు. […]
దిశ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ జట్టు మధ్య నిన్న జరిగిన పోరులో అనుహ్యంగా ఢిల్లీ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ సేన గెలవడానికి ‘ఆ ఒక్క బంతే’ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
మ్యాచ్ చివరి 19వ ఓవర్‌లో తొలి బంతిని తుషార్ వైడ్ వేశాడు. ఆ తర్వాతి బంతిని తెవాతియా భారీ షాట్ కొట్టాడు. దీంతో సిక్స్ వెళ్లాల్సిన బంతిని బౌండరీ వద్ద అజింక్య రహానే అద్భుతంగా ఆపి మైదానంలోకి విసిరాడు. పక్కనే మరో ఫీల్డర్ ఉండుంటే మంచి రిలే క్యాచ్ అయ్యేది. కానీ ఇక్కడ ఆరు పరుగుల రావాల్సిన చోటు ఒక్క పరుగే రావడంతో మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ చేతుల్లోకి వచ్చేసింది. ఆ ఒక్క బంతే గేమ్ ఛేంజర్‌గా మారి ఢిల్లీ విజయానికి కారణమైంది.