రక్షణ మంత్రి లఢక్ పర్యటన రద్దు
దిశ, వెబ్‌డెస్క్: భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణ పరిస్థితులు నెలకొన్నందున లఢక్ సరిహద్దుల్లో సైన్యం సన్నద్ధతను సమీక్షించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తలపెట్టిన పర్యటన అనుకోకుండా రద్దయ్యింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లఢక్‌లో పర్యటించాల్సి ఉంది.కాగా, ఈ పర్యటన రద్దయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే రక్షణ మంత్రి తన పర్యటనను అకస్మాత్తుగా ఎందుకు మార్చుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఇరుదేశాల కమాండర్ స్థాయి […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణ పరిస్థితులు నెలకొన్నందున లఢక్ సరిహద్దుల్లో సైన్యం సన్నద్ధతను సమీక్షించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తలపెట్టిన పర్యటన అనుకోకుండా రద్దయ్యింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లఢక్‌లో పర్యటించాల్సి ఉంది.కాగా, ఈ పర్యటన రద్దయినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే రక్షణ మంత్రి తన పర్యటనను అకస్మాత్తుగా ఎందుకు మార్చుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఇరుదేశాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య మూడు సార్లు జరిగిన చర్చలు ఎటూ తేలలేదు. ఓ వైపు చర్చలంటూనే డ్రాగన్ కంట్రీ కయ్యానికి కాలు దువ్వుతుండటంతో భారత రక్షణ దళాలు కూడా సరిహద్దుల్లో అప్రమత్తమయ్యాయి.