వరల్డ్ నెంబర్ 1గా దీపిక కుమారి
దిశ, స్పోర్ట్స్: పారిస్‌లో జరిగిన ప్రపంచ కప్ మూడో దశ పోటీల్లో ఆర్చర్ దీపికా కుమారి హ్యాట్రిక్ బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దీపికా కుమారి మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచకప్ స్టేజ్ 3 టోర్నమెంట్‌లో దీపిక ఏకంగా మూడు స్వర్ణాలను సాధించి చరిత్ర సృష్టించింది. తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా అంకిత భకత్, కోమలికతో కలిసి బరిలోకి దిగి పసిడి పతకం […]
దిశ, స్పోర్ట్స్: పారిస్‌లో జరిగిన ప్రపంచ కప్ మూడో దశ పోటీల్లో ఆర్చర్ దీపికా కుమారి హ్యాట్రిక్ బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దీపికా కుమారి మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచకప్ స్టేజ్ 3 టోర్నమెంట్‌లో దీపిక ఏకంగా మూడు స్వర్ణాలను సాధించి చరిత్ర సృష్టించింది. తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా అంకిత భకత్, కోమలికతో కలిసి బరిలోకి దిగి పసిడి పతకం దక్కించుకుంది. మిక్స్‌డ్ విభాగంలో దీపిక తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. వ్యక్తిగత రికర్వ్‌లోనూ దీపిక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఓకే ప్రపంచకప్ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి ఆర్చర్‌గా కూడా గుర్తింపు పొందింది. త్వరలో జరుగబోయే ఒలింపిక్స్‌లో కూడా దీపిక పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్నది. భారత అథ్లెట్లలో తప్పక పతకం గెలిచే అవకాశం ఉన్న క్రీడాకారుల్లో దీపిక ఒకరు.