ఒలింపిక్స్ బహిష్కరించనున్న ఇండియా..?

కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా దేశాలు టోక్యో ఒలంపిక్స్ 2020లో పాల్గొనబోమని తేల్చిచెప్పాయి. కాగా, పలు దేశాల ప్రభుత్వాలు ఒలింపిక్ కమిటీలతో చర్చలు జరుపుతున్నాయి. ఒలింపిక్స్ వాయిదాకు ఐవోసీ ససేమిరా అనడంతో.. ప్రస్తుతం ఆయా దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం కూడా టోక్యోకు అథ్లెట్లను పంపాలా వద్దా అనే మీమాంసలో ఉంది. మరో నాలుగు వారాల్లో ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని చెబుతామని భారత ఒలింపిక్ సంఘం […]

Update: 2020-03-24 03:53 GMT

కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా దేశాలు టోక్యో ఒలంపిక్స్ 2020లో పాల్గొనబోమని తేల్చిచెప్పాయి. కాగా, పలు దేశాల ప్రభుత్వాలు ఒలింపిక్ కమిటీలతో చర్చలు జరుపుతున్నాయి. ఒలింపిక్స్ వాయిదాకు ఐవోసీ ససేమిరా అనడంతో.. ప్రస్తుతం ఆయా దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం కూడా టోక్యోకు అథ్లెట్లను పంపాలా వద్దా అనే మీమాంసలో ఉంది. మరో నాలుగు వారాల్లో ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయాన్ని చెబుతామని భారత ఒలింపిక్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతా చెప్పారు. ‘

మరో నాలుగు వారాలు పరిస్థిని గమనిస్తాం. ఇప్పటికే క్రీడా మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం. పరిస్థితి తీవ్రత పెరిగితే భారత అథ్లెట్లు పాల్గొనేది లేదని చెబుతామని’ ఆయన అన్నారు.

Tags: Olympics, Corona effect, Tokyo, IOC, Sports Ministry

Tags:    

Similar News