గవర్నర్ కోర్టులో రాజధాని బంతి

దిశ, ఏపీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ౌపరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు అంటే ఏపీ రాజధాని బిల్లు రాజ్‌భవన్‌కు చేరింది. గత పది రోజులుగా అమరావతి రీజియన్‌లో రాజధాని జేఏసీ ఆందోళన ఉదృతం చేసింది. ఇదే సమయంలో విపక్ష పార్టీల నేతలంతా రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీలు ఇంకాస్త ముందుకు వెళ్లి గవర్నర్‌కు లేఖలు రాశాయి. వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏకంగా […]

Update: 2020-07-23 02:34 GMT

దిశ, ఏపీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ౌపరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు అంటే ఏపీ రాజధాని బిల్లు రాజ్‌భవన్‌కు చేరింది. గత పది రోజులుగా అమరావతి రీజియన్‌లో రాజధాని జేఏసీ ఆందోళన ఉదృతం చేసింది. ఇదే సమయంలో విపక్ష పార్టీల నేతలంతా రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీలు ఇంకాస్త ముందుకు వెళ్లి గవర్నర్‌కు లేఖలు రాశాయి. వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏకంగా రాష్ట్రపతిని కలిగి ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలు చేపడతోందంటూ ఫిర్యాదు చేశారు.

మరోవైపు టీడీపీ వర్గాలు ఏపీలోని సముద్ర అంతర్గతంలో చీలిక ఏర్పడిందని, దీనితో వైజాగ్‌కి ఎప్పటికైనా ముప్పేనంటూ వార్తా కథనాలు ముందుకు తెచ్చింది. దీనిపై ఏయూలో ఓషియానిక్ స్టడీస్ సెంటర్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ.. ఆ చీలిక ఇప్పుడు ఏర్పడింది కాదని, దాని వల్ల వైజాగ్‌కి ఎలాంటి ప్రమాదం లేదని, టెక్టోనిక్ ప్లేట్లలో ఏర్పడిన చీలిక అని, దాని వల్ల ఎప్పుడూ ప్రమాదం ఉండదని, సునామీ లాంటివి వచ్చే అవకాశం లేదని, అయితే తీర ప్రాంతం ముంపుకు గురయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేమని వ్యాఖ్యానించారు. అంతే తప్ప వైజాగ్‌కి ఈ చీలిక వల్ల ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును రాజ్‌భవన్‌కి చేర్చింది.

ఈ బిల్లుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గవర్నర్ దీనికి ఆమోద ముద్ర వేస్తే ఇక మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే తరువాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఫైల్‌పై సంతకం పెడతారా? అన్నదే ఆసక్తి రేపుతోంది. ఈ బిల్లు పంపేందుకు, ఆమోదించేందుకు అవసరమైన అన్ని న్యాయపరమైన చిక్కులు తొలగినట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సిన అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తరువాతే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులను ప్రభుత్వం తరఫున గవర్నర్‌కు పంపించారు. నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, న్యాయస్ధానం ఆదేశాలు పాటించినందున దీనిపై ఎలా వ్యవహరిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News