నిర్మల్‌లో రేషన్ డీలర్ చేతివాటం

దిశ, ఆదిలాబాద్: రేషన్ సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు అవకతవకలకు పాల్పడుతున్నారు. ప్రతి రేషన్ కార్డుపై కిలో కంది పప్పుకు బదులు పావుకిలో కోత పెట్టి లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో అనేక మంది రేషన్ డీలర్ల మీద ఈ రకమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఖానాపూర్ పట్టణంలో ఓ డీలర్ బాగోతం బుధవారం వెలుగులోకి వచ్చింది. 28వ నెంబరు రేషన్ షాప్ డీలర్ కంది పప్పు తూకంలో చేతివాటం ప్రదర్శించాడన్న ఆరోపణలు రావడంతో జిల్లా […]

Update: 2020-05-06 02:42 GMT

దిశ, ఆదిలాబాద్: రేషన్ సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు అవకతవకలకు పాల్పడుతున్నారు. ప్రతి రేషన్ కార్డుపై కిలో కంది పప్పుకు బదులు పావుకిలో కోత పెట్టి లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో అనేక మంది రేషన్ డీలర్ల మీద ఈ రకమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఖానాపూర్ పట్టణంలో ఓ డీలర్ బాగోతం బుధవారం వెలుగులోకి వచ్చింది. 28వ నెంబరు రేషన్ షాప్ డీలర్ కంది పప్పు తూకంలో చేతివాటం ప్రదర్శించాడన్న ఆరోపణలు రావడంతో జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ రేషన్ షాపును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి కార్డుపై కిలో కంది పప్పు ఇవ్వాల్సి ఉండగా, 700 గ్రాములతో పంపిణీ చేస్తున్నట్లు తేలింది. సమగ్ర విచారణ అనంతరం డీలర్‌పై చర్యలు తీసుకుంటామని కిరణ్ కుమార్ తెలిపారు.

Tags: ration dealer, adilabad, ration distribution, ts news

Tags:    

Similar News