అప్పుడు మత్స్యకారుడు.. ఇప్పుడు మహిళ 

దిశ, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ణాపూర్ మున్సిపల్ పరిధిలోని పాండవుల చెరువులో తెలియాడుతోన్న మహిళ మృతదేహం స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. పది రోజుల క్రితం మత్స్యకారుడు ఇదే చెరువులో పడి మృతి చెందిన సంగతి మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం నీటిపై మహిళ మృతదేహం తేలియాడడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని గజ్వేల్ పట్టణానికి చెందిన బాకి మల్లయ్య భార్య బాకి లక్ష్మి(50) గా పోలీసులు గుర్తించారు. […]

Update: 2020-09-10 22:20 GMT

దిశ, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ణాపూర్ మున్సిపల్ పరిధిలోని పాండవుల చెరువులో తెలియాడుతోన్న మహిళ మృతదేహం స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. పది రోజుల క్రితం మత్స్యకారుడు ఇదే చెరువులో పడి మృతి చెందిన సంగతి మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.

శుక్రవారం ఉదయం నీటిపై మహిళ మృతదేహం తేలియాడడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని గజ్వేల్ పట్టణానికి చెందిన బాకి మల్లయ్య భార్య బాకి లక్ష్మి(50) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతురాలిది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Read Also…

ముగ్గురు చిన్నారులు అదృశ్యం

Full View

Tags:    

Similar News