చెన్నై చేరుకున్న వార్నర్ బ్రదర్స్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ సందడి మొదలవడంతో అన్ని జట్లూ వారి తొలి అంచె మ్యాచ్‌లు ఆడే వేదికలకు చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ఏకైక టీమ్ సన్ రైజర్స్ తొలి విడతలో చెన్నైలో మ్యాచ్‌లు ఆడనున్నది. దీంతో యాజమాన్యం జట్టు కోసం అక్కడే క్వారంటైన్‌తో పాటు బయోబబుల్ కూడా ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని క్రికెటర్లు ఇప్పటికే చెన్నై చేరుకొని సాధన ప్రారంభించారు. కాగా, శుక్రవారం సన్‌రైజర్స్ క్యాంపులో కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్‌సన్, […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ సందడి మొదలవడంతో అన్ని జట్లూ వారి తొలి అంచె మ్యాచ్‌లు ఆడే వేదికలకు చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ఏకైక టీమ్ సన్ రైజర్స్ తొలి విడతలో చెన్నైలో మ్యాచ్‌లు ఆడనున్నది. దీంతో యాజమాన్యం జట్టు కోసం అక్కడే క్వారంటైన్‌తో పాటు బయోబబుల్ కూడా ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని క్రికెటర్లు ఇప్పటికే చెన్నై చేరుకొని సాధన ప్రారంభించారు. కాగా, శుక్రవారం సన్‌రైజర్స్ క్యాంపులో కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్‌సన్, బ్రాడ్ హాడిన్ జట్టుతో చేరారు. ఈ విషయాన్నే సన్ రైజర్స్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది.
అయితే విదేశాల నుంచి వచ్చిన క్రికెట్లు తప్పకుండా 7 రోజుల క్వారంటైన్ పాటించాల్సి ఉండటంతో వీరు ముగ్గురు వారికి కేటాయించిన హోటల్ రూమ్స్‌లో సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఇటీవల జరిగిన మ్యాచ్ సమయంలో గాయం పాలయ్యాడు. అతడికి కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరం అని న్యూజీలాండ్ మెడికల్ మేనేజర్ చెప్పాడు. దీంతో ఐపీఎల్ తొలి విడతలో కేన్ విలియమ్‌సన్ ఆడతాడా లేదా అనేది అనుమానంగా మారింది.