ఒకప్పుడు హీరోలా వెలిగి.. ఇప్పుడు జీరోగా మారిన David Warner
దిశ, స్పోర్ట్స్: డేవిడ్ వార్నర్ అంటే ఒకప్పుడు ప్రత్యర్థులకు హడల్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు అతడో పెద్ద హీరో. గతంలో క్రికెట్ నిషేధాన్ని ఎదుర్కొన్న సమయంలో హైదరాబాద్ ఫ్యాన్స్ అతడికి ఎంతో సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ ఎన్నో వీడియోలు చేస్తూ అందరికీ దగ్గరయ్యాడు. ఒకప్పుడు హీరోలా వెలిగిపోయిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2021లో జీరోగా మారిపోయాడు. వరుస ఓటములతో కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా బ్యాటింగ్ వైఫల్యంతో తుది జట్టులో స్థానం కూడా […]
దిశ, స్పోర్ట్స్: డేవిడ్ వార్నర్ అంటే ఒకప్పుడు ప్రత్యర్థులకు హడల్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు అతడో పెద్ద హీరో. గతంలో క్రికెట్ నిషేధాన్ని ఎదుర్కొన్న సమయంలో హైదరాబాద్ ఫ్యాన్స్ అతడికి ఎంతో సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ ఎన్నో వీడియోలు చేస్తూ అందరికీ దగ్గరయ్యాడు. ఒకప్పుడు హీరోలా వెలిగిపోయిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2021లో జీరోగా మారిపోయాడు. వరుస ఓటములతో కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా బ్యాటింగ్ వైఫల్యంతో తుది జట్టులో స్థానం కూడా దక్కడం లేదు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సమయంలో కనీసం గ్రౌండ్‌కు కూడా రాకుండానే హోటల్ గదికి పరిమితం అయ్యాడు.
డేవిడ్ వార్నర్ మిగిలిన మ్యాచ్‌లకు కూడా తుది జట్టులో ఉండడని.. అతడిని వచ్చే సీజన్‌కు కొనుగోలు చేయడానికి కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆసక్తి లేదని ఫ్రాంచైజీకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జట్టులో వార్నర్‌కు ఇక స్థానం ఉండబోదని.. త్వరలోనే ఎవరెవరిని రిటైన్ చేసుకుంటామో ప్రకటిస్తామని.. అందులో వార్నర్ ఉండబోడని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో పూర్తిగా కొత్త వారిని కొనుగోలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.