ఈసారి స్లెడ్జ్ చేయను: వార్నర్

దిశ, స్పోర్ట్స్: బాల్ టాంపరింగ్ ఘటనలో నిషేధం ఎదుర్కొన్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌లో చాలా మార్పు వచ్చింది. గతంలో పర్యాటక జట్టును ఉద్దేశించి పలుమార్లు స్లెడ్జింగ్‌ చేసిన డేవిడ్ వార్నర్ ఈసారి అలా చేయనని చెబుతున్నాడు. ఈ ఏడాది చివర్లో టీం ఇండియా రెండు దఫాలుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడుతూ.. ఈ సారి టీం ఇండియా కెప్టెన్‌ను స్లెడ్జ్ చేయనని స్పష్టం […]

Update: 2020-06-21 07:37 GMT

దిశ, స్పోర్ట్స్: బాల్ టాంపరింగ్ ఘటనలో నిషేధం ఎదుర్కొన్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌లో చాలా మార్పు వచ్చింది. గతంలో పర్యాటక జట్టును ఉద్దేశించి పలుమార్లు స్లెడ్జింగ్‌ చేసిన డేవిడ్ వార్నర్ ఈసారి అలా చేయనని చెబుతున్నాడు. ఈ ఏడాది చివర్లో టీం ఇండియా రెండు దఫాలుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడుతూ.. ఈ సారి టీం ఇండియా కెప్టెన్‌ను స్లెడ్జ్ చేయనని స్పష్టం చేశాడు. ‘కొహ్లీని ఏ మాత్రం కవ్వించకూడదు. అతను అందరి లాంటి ఆటగాడు కాదు. ఎలుగుబంటిని రెచ్చగొట్టడంలో అర్థమే లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడిని స్లెడ్జ్ చేయను’ అని స్పష్టం చేశాడు. గతంలో కొహ్లీ, రోహిత్ శర్మలపై వార్నర్ పలుమార్లు నోరు పారేసుకున్నాడు. కానీ నిషేధం అతనిలో చాలా మార్పు తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఇక, టిక్‌టాక్ వీడియోల గురించి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో అందరినీ కాస్త నవ్విద్దామనే ఆ వీడియోలు చేశానని చెప్పాడు. అయితే ఇండియన్ మ్యూజిక్‌కు స్టెప్పులు వేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News