‘దళితుల భూములను లాక్కున్న కేసీఆర్’

దిశ, భువనగిరి రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం హుజురాబాద్ పర్యటనకు వెళుతూ.. మార్గమధ్యలోని భువనగిరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్.. వారి వద్ద నుంచి లాక్కున్న భూములే ఎక్కువ అని విమర్శించారు. బై […]

Update: 2021-07-27 05:56 GMT

దిశ, భువనగిరి రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం హుజురాబాద్ పర్యటనకు వెళుతూ.. మార్గమధ్యలోని భువనగిరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్.. వారి వద్ద నుంచి లాక్కున్న భూములే ఎక్కువ అని విమర్శించారు. బై ఎలక్షన్లు వచ్చినప్పుడే దళితులు, బీసీలు, గిరిజనుల గుర్తుకువస్తారన్నారు. భువనగిరిలో కూడా దళితులకు చెందిన 180 ఎకరాల భూమిని లాక్కున్నారని.. కోకాపేటలో కూడా ఇలాగే చేస్తున్నారని.. దీనిపై ఎంక్వైరీ కమిషన్ వేయాలని దామోదర రాజనర్సింహ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News