పొట్ట కూటికోసం కూలి పనికి వెళ్లి అంతలోనే..
దిశ, జడ్చర్ల : డీసీఎం ట్రాక్టర్ ఢీకొని రోజు వారి కూలీ మృతి చెందిన సంఘటన రాజాపూర్ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా మార్చల గ్రామానికి చెందిన రవి 36 ఊరుకొండ మండల కేంద్రంలోని గుట్టలపై తొలచిన రాళ్ల కడ్డీలను ట్రాక్టర్‌లో ఇతర ప్రాంతాలకు తరలించేందుకు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా శుక్రవారం ఉదయం రాళ్ల కడ్డీలలోడుతో […]
దిశ, జడ్చర్ల : డీసీఎం ట్రాక్టర్ ఢీకొని రోజు వారి కూలీ మృతి చెందిన సంఘటన రాజాపూర్ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా మార్చల గ్రామానికి చెందిన రవి 36 ఊరుకొండ మండల కేంద్రంలోని గుట్టలపై తొలచిన రాళ్ల కడ్డీలను ట్రాక్టర్‌లో ఇతర ప్రాంతాలకు తరలించేందుకు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా శుక్రవారం ఉదయం రాళ్ల కడ్డీలలోడుతో ఉన్న ట్రాక్టర్ తీసుకొని మధ్య రాత్రి మూడు గంటలకు చేవెళ్లకు డ్రైవర్‌తో పాటు రవి బయల్దేరారు.
ఈ క్రమంలో మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాళ్ల కడ్డీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుండి డీసీఎం వేగంగా ఢీకొనడంతో రవి ట్రాక్టర్ పై నుండి ఎగిరి రోడ్డుపై పడ్డాడు, ఈ క్రమంలో మరో డీసీఎం రవి పై నుండి వెళ్లడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. పొట్టకూటి కోసం అర్ధరాత్రి కూలి పనికి వెళ్లిన రవి రోడ్డు ప్రమాదంలో మరణిచడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య తో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు కుటుంబం కటిక పేదరికంలో ఉందని మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.