ఇలా నొక్కితే.. తుఫాన్ లైవ్ అప్డేట్స్ అలా వచ్చేస్తాయ్

దిశ, ఫీచర్స్ : భారీ తుఫాను కారణంగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ కుండపోతగా వర్షాలు కురుస్తుండగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇటు ఉత్తరాంధ్ర, అటు దక్షిణ ఒడిషా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసిన అధికారులు.. ఈ రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో సైక్లోన్ గులాబ్‌ను ఎలా […]

Update: 2021-09-27 01:54 GMT

దిశ, ఫీచర్స్ : భారీ తుఫాను కారణంగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ కుండపోతగా వర్షాలు కురుస్తుండగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇటు ఉత్తరాంధ్ర, అటు దక్షిణ ఒడిషా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసిన అధికారులు.. ఈ రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో సైక్లోన్ గులాబ్‌ను ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకుందాం.

ఈ ఏడాది ప్రారంభంలో సంభవించిన ‘యాస్, తౌక్తే’ తుఫాన్ల తర్వాత వచ్చిన మూడో సైక్లోన్ ‘గులాబ్’. దీని ప్రభావంతో మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా బంగాళాఖాతం, అండమాన్ సముద్రం లేదా పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తీరాల్లోకి వెళ్లకూడదని IMD మత్స్యకారులను హెచ్చరించింది. ఈ మేరకు గులాబ్ తుఫాన్ ఏ వైపుగా వస్తుందో తెలుసుకునేందుకు పలు యాప్స్, వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా ‘ఐఎమ్‌డీ’ అధికారిక వెబ్‌సైట్‌ mausam.imd.gov.in‌లోని సైక్లోన్ విభాగం ద్వారా తుఫాన్ సంబంధిత వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు. అంతేకాదు సైక్లోన్ గులాబ్‌ను ట్రాక్ చేయడానికి ఈ వెబ్‌సైట్‌ను ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు.

ఉమాంగ్ యాప్
గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ రెండింటిలోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. సెంట్రల్ నుంచి స్థానిక ప్రభుత్వ సంస్థల వరకు పాన్ ఇండియా స్థాయిలో ఈ-గవర్నమెంట్ సేవల కోసం ఆల్ ఇన్ వన్ యాప్‌గా దీన్ని ఉపయోగిస్తారు. వాటితో పాటు ఐఎమ్‌డీ అప్‌డేట్స్ సహా సమాచారాన్ని నేరుగా యాక్సెస్ చేయవచ్చు.

RSMC వెబ్‌సైట్
IMDకి సంబంధించిన మరో వెబ్ సర్వీస్ ఇది. రియల్ టైమ్‌లో తుఫాన్లను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

స్కైమెట్ వెదర్
భారతదేశంలో వాతావరణాన్ని అంచనా వేయడంలో అత్యంత విశ్వసనీయమైన యాప్ ‘స్కైమెట్ వెదర్’. ఈ యాప్ రుతుపవనాల రాక, వర్షాలతో సహా అన్ని రకాల వాతావరణ అంచనాలతో కూడిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. స్కైమెట్ వాతావరణ శాస్త్రవేత్తలు 7000+ ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు, ఉపగ్రహ చిత్రాల ద్వారా పాన్ ఇండియా నెట్‌వర్క్ నుంచి ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషిస్తారు.

Tags:    

Similar News