డీమార్ట్ పేరిట ఉచిత బహుమతులు.. లింక్ ఓపెన్ చేస్తే ఇక అంతే
దిశ, ఎల్బీనగర్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ అప్‌డేట్ అవుతున్నారు. ప్రజల వీక్‌నెస్‌ను సొమ్ము చేసుకునేందుకు కొత్త దారులను వెతుక్కుంటున్నారు. ఉచిత బహుమతులు పేరిట లింక్‌లను వదులుతున్నారు. ఉచితం అనే మాటను ఎరగా వేసి డబ్బులు కాజేస్తున్నారు. పోలీసులు, సైబర్ నిపుణులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా.. కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు వాటిని చేధిస్తూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈసారి […]
దిశ, ఎల్బీనగర్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ అప్‌డేట్ అవుతున్నారు. ప్రజల వీక్‌నెస్‌ను సొమ్ము చేసుకునేందుకు కొత్త దారులను వెతుక్కుంటున్నారు. ఉచిత బహుమతులు పేరిట లింక్‌లను వదులుతున్నారు. ఉచితం అనే మాటను ఎరగా వేసి డబ్బులు కాజేస్తున్నారు. పోలీసులు, సైబర్ నిపుణులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా.. కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు వాటిని చేధిస్తూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈసారి సైబర్ నేరగాళ్లు తన నేరానికి డీమార్ట్‌ను పావుగా వాడుకున్నారు. డీమార్ట్ షాపింగ్ మాల్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వినియోగదారులకు ఉచితంగా బహుమతులు ఇవ్వనున్నట్లు ఓ లింక్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇది మోసపూరితమైన లింగ్ అని, డీమార్ట్ ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించలేదని పోలీసులు తేల్చి చెప్పారు. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే ఖతాలోని డబ్బులు మొత్తం ఖాళీ అవుతాయని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు డీమార్ట్ పేరుతో పోస్టు చేసిన ఫేక్ లింక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సైబర్ వింగ్ పోలీసులు.. 'బీ అలర్ట్ ఈ లింక్‌ను ఓపెన్ చేయొద్దు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.