ఏపీలో ఆగష్టు 14 వరకు కర్ఫ్యూ ఆంక్షలు

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాలు, సంస్ధలు, వ్యాపార సముదాయాలు , దుకాణాల్లో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాస్క్‌లు లేని వారిని లోపలికి అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానాతోపాటు 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారి […]

Update: 2021-07-31 09:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాలు, సంస్ధలు, వ్యాపార సముదాయాలు , దుకాణాల్లో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాస్క్‌లు లేని వారిని లోపలికి అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానాతోపాటు 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారి ఫొటోలను 8010968295కు వాట్సప్ చెయాలని తెలిపింది. వాట్సప్‌లో ఫిర్యాదు చేసినా..ఫోటోలు పంపినా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే రాష్ట్రంలో ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొవిడ్ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని..లేనిపక్షంలో ఉపేక్షించేది లేదన్నారు. మాస్క్‌లు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News