ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. ఆ టైం వరకే రెస్టారెంట్లు, షాపులు

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఏపీలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్టు పేర్కొంది. కానీ, ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటల […]

Update: 2021-06-28 02:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఏపీలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్టు పేర్కొంది.

కానీ, ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. ఇదే సమయంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు, షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సడలింపు జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అమలులో ఉండనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటలకు వరకు యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది.

 

Tags:    

Similar News