జిల్లాకు చేరుకున్న ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ సైకిల్ యాత్ర..

దిశ, అదిలాబాద్: సిఆర్పిఎఫ్ సైకిల్ యాత్ర సమైక్యతకు స్పూర్తిని ఇచ్చిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు “ఆజాది కా అమృత్ మహోత్సవ్” వేడుకల్లో భాగంగా సిఆర్పిఎఫ్ బలగాలు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం జిల్లాకు చేరుకున్నది. సోమవారం జిల్లా పోలీసులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా శిక్షణ అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ తో కలిసి జిల్లా ఎస్పీలు […]

Update: 2021-09-13 06:43 GMT

దిశ, అదిలాబాద్: సిఆర్పిఎఫ్ సైకిల్ యాత్ర సమైక్యతకు స్పూర్తిని ఇచ్చిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు “ఆజాది కా అమృత్ మహోత్సవ్” వేడుకల్లో భాగంగా సిఆర్పిఎఫ్ బలగాలు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం జిల్లాకు చేరుకున్నది. సోమవారం జిల్లా పోలీసులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా శిక్షణ అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ తో కలిసి జిల్లా ఎస్పీలు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేరడిగొండ సరిహద్దు నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు జిల్లా ప్రజలు ఘనమైన స్వాగతం పలుకుతూ జాతీయ సమైక్యతపై నినాదాలు చేస్తూ.. ఉత్సాహంతో సిఆర్పిఎఫ్ సైకిల్ యాత్రికుల వెంట ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 21 మంది సభ్యుల సైకిల్ యాత్రలో ఇద్దరు దివ్యాంగా అధికారుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. భారతదేశమంతటా శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన పాత్ర సిఆర్పిఎఫ్ బలగాలు పోషిస్తాయని పేర్కోన్నారు.

Tags:    

Similar News