కొమురవెల్లిలో భక్తుల రద్దీ
దిశ, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శనివారం రాత్రి నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు వేకువజామున లేచి కొనేరులో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలైన్ లో నిలిచి దర్శించుకున్నారు. రేగు చెట్టు వద్ద, మహామండపంలో పట్నాలు వేసి, కేశ కండన, అభిషేకం, అర్చన, కళ్యాణం, రేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె తదితర మొక్కులు చెలించుకొని కొండపై ఉన్న ఎల్లమ్మ అమ్మవారుకు మట్టికుండలో బోనం, కల్లు […]
దిశ, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శనివారం రాత్రి నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు వేకువజామున లేచి కొనేరులో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలైన్ లో నిలిచి దర్శించుకున్నారు. రేగు చెట్టు వద్ద, మహామండపంలో పట్నాలు వేసి, కేశ కండన, అభిషేకం, అర్చన, కళ్యాణం, రేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె తదితర మొక్కులు చెలించుకొని కొండపై ఉన్న ఎల్లమ్మ అమ్మవారుకు మట్టికుండలో బోనం, కల్లు సాక పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాలు దగ్గరపడుతున్న తరుణంలో భక్తుల రద్దీ పెరిగింది అని ఆలయ ఏవో బాలాజీ తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దర్మకర్తల మండలి చైర్మన్ గిస భిక్షపతి, ఏఈఓ అంజయ్య, అర్చకులు, ఒగ్గుపూజరులు, ఆలయ అధికారులు సేవలందించారు.