వలస కార్మికులతో కిక్కిరిసిన బస్సు బోల్తా
భోపాల్: సామర్థ్యానికి మించి వలస కార్మికులను ఎక్కించుకుని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌కు బయల్దేరిన ఓ బస్సు మంగళవారం ఉదయం బోల్తా పడింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 12 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్-ఝాన్సీ హైవేపై వెళ్తున్న బస్సు జౌరాసీ ఘాట్ దగ్గర ఓ మూలమలుపులో అదుపుతప్పి బోల్తా పడిందని పోలీసులు వివరించారు. ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటనతో చాలా మంది […]
భోపాల్: సామర్థ్యానికి మించి వలస కార్మికులను ఎక్కించుకుని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌కు బయల్దేరిన ఓ బస్సు మంగళవారం ఉదయం బోల్తా పడింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 12 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్-ఝాన్సీ హైవేపై వెళ్తున్న బస్సు జౌరాసీ ఘాట్ దగ్గర ఓ మూలమలుపులో అదుపుతప్పి బోల్తా పడిందని పోలీసులు వివరించారు.
ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటనతో చాలా మంది వలసకార్మికులు సొంతూళ్లకు ప్రయాణం కట్టారు. అందులో భాగంగానే సోమవారం ఢిల్లీలో ఈ బస్సులో సామర్థ్యానికి మించైనా ప్రయాణించడానికి సిద్ధపడ్డారు. చాలా మంది బస్సు మీద కూడా కూర్చున్నారని ఓ ప్రయాణికుడు తెలిపారు. బస్సులోని సిబ్బంది అంతా మద్యం సేవించారని, దోల్‌పూర్‌లో అంతకుముందే ఓ ట్రక్‌ను బస్సు ఢీకొట్టిందని చెప్పడం గమనార్హం. భయాలతో వలస కార్మికులు సొంతూళ్లకు బయల్దేరడం గతేడాది హృదయవిదారక దృశ్యాలను గుర్తుచేస్తున్నాయి.