చార్మినార్‌లో జనసందోహం.. కనిపించని భౌతికదూరం…
దిశ, తెలంగాణ బ్యూరో : రంజాన్ ముస్లింల పెద్ద పండుగ. ఈ పండుగకు పేద, దనిక అనే తేడా లేకుండా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ నెల 14న రంజాన్ పండుగను పురస్కరించుకొని వస్త్రాల కొనుగోలుతో పాటు పండుగకు అవసరమయ్యే సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఆదివారం ముస్లింలు చార్మినార్‌కు భారీగా చేరుకున్నారు. పలు వస్తువుల కొనుగోళ్లలో బీజీబీజీ అయ్యారు. దీంతో చార్మినార్ ప్రాంగణమంతా జనసందడి నెలకొంది. కనిపించని కోవిడ్ నిబంధనలు ప్రభుత్వం, వైద్యులు కరోనా సెకండ్ వే […]
దిశ, తెలంగాణ బ్యూరో : రంజాన్ ముస్లింల పెద్ద పండుగ. ఈ పండుగకు పేద, దనిక అనే తేడా లేకుండా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ నెల 14న రంజాన్ పండుగను పురస్కరించుకొని వస్త్రాల కొనుగోలుతో పాటు పండుగకు అవసరమయ్యే సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఆదివారం ముస్లింలు చార్మినార్‌కు భారీగా చేరుకున్నారు. పలు వస్తువుల కొనుగోళ్లలో బీజీబీజీ అయ్యారు. దీంతో చార్మినార్ ప్రాంగణమంతా జనసందడి నెలకొంది.
కనిపించని కోవిడ్ నిబంధనలు
ప్రభుత్వం, వైద్యులు కరోనా సెకండ్ వే తీవ్రంగా ఉందని కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార మధ్యమాల్లో సైతం కోవిడ్ తీవ్రతను వివరిస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం కోవిడ్ నిబంధనలకు తిలోధకాలు ఇస్తూనే ఉన్నారు. చార్మినార్ వచ్చిన ప్రజలు ఎక్కడ కూడా భౌతిక దూరం పాటించినట్లు కనిపించిన దాఖలాలు లేవు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే కోవిడ్ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి.