Accident: పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
క్రిస్మస్(Christmas) పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్(Christmas) పండుగపూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాజస్థాన్(Rajasthan)లోని కరౌలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, వడోదరకు చెందిన కొందరు కారులో రాజస్థాన్లోని కైలాదేవిని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.