పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం నష్టపోయిన పంటలను అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రైతుల పంట నష్టంపై చర్చ జరుగుతుందని ఆశించిన […]

Update: 2020-04-12 05:58 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం నష్టపోయిన పంటలను అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రైతుల పంట నష్టంపై చర్చ జరుగుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలిందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందక పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, ఇలాంటి సమయంలో కేంద్ర, రాష్ట్రాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.

tags:Farmers, Kisan Congress, Kodandaram Reddy, Telangana Cabinet, Meeting

Tags:    

Similar News