డ్రగ్స్ విక్రయ ముఠా అరెస్టు..

దిశ, క్రైమ్ బ్యూరో : గోవా నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఆ రాష్ట్రం నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం, పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేయించడం ఈ ముఠా పని. దీంతో విశ్వసనీయ సమాచారం మేరకు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సల్మాన్ అనే వ్యక్తి నగరంలోని ప్రముఖ పబ్బులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనిఖీల్లో […]

Update: 2020-11-17 12:07 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : గోవా నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఆ రాష్ట్రం నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం, పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేయించడం ఈ ముఠా పని. దీంతో విశ్వసనీయ సమాచారం మేరకు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. సల్మాన్ అనే వ్యక్తి నగరంలోని ప్రముఖ పబ్బులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనిఖీల్లో భాగంగా అతని నుంచి 200 గ్రాముల ఎండీఎం మాదకద్రవ్యాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న అహ్మద్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. అమ్మాయిలు సల్మాన్ ద్వారానే గోవా నుంచి నగరానికి వస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని వ్యభిచారానికి, డ్రగ్స్ విక్రయానికి ఉపయోగిస్తూ సల్మాన్ డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News