క్లాస్ రూంలో అమ్మాయిలతో కలిసి స్టూడెంట్స్ బూతు వీడియోలు.. ప్రిన్సిపాల్ చూశాడని..

* క్లాస్ రూంలోనే ఇంటర్ విద్యార్థులు గలీజు పనులు * అమ్మాయిలతో కలిసి బూతు వీడియోలు చూసిన అబ్బాయిలు * ప్రిన్సిపల్ మందలించాడని దారి కాసి విచక్షణ రహితంగా దాడి

Update: 2024-07-30 13:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : స్మార్ట్ ఫోన్ వల్ల విద్యార్థులు చెడిపోతున్నారనడానికి ఈ సంఘటనే ఉదాహారణ. మైనార్టీ తీరకముందే నగ్న చిత్రాలు, న్యూడ్ వీడియోలు చూడటం.. ఆపై అఘాయిత్యాలకు పాల్పడటం తరచూ వార్తల్లో చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ కళాశాలలో క్లాస్ రూంలోనే అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి న్యూడ్ వీడియోలు చూస్తూ ప్రిన్సిపల్‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అంతేకాదు.. మందలించిన ప్రిన్సిపల్‌ను పొట్టుపొట్టుగా కొట్టి పడేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

డియోరియా జిల్లాలోని బాఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంత్ త్రివేణి పర్వత్ జూనియర్ కాలేజీలో 2800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడో పీరియడ్ సమయంలో క్లాస్ రూంలో అమ్మాయిలు, అబ్బాయిలు గుంపుగా కూర్చోని ఫోన్లలో న్యూడ్ వీడియోలు చూడసాగారు. అదే సమయంలో అటుగా వచ్చిన ప్రిన్సిపల్ శశి శేఖర్ ఆ దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని స్టూడెంట్స్‌ను మందలించాడు. ఆపై వారి ఫోన్లు తీసుకుని వీడియోలను డిలీట్ చేసి ఇచ్చాడు. మళ్లీ ఇలాంటి చర్యలు రిపీట్ కావద్దని హెచ్చరించి వెళ్లిపోయాడు.

ప్రిన్సిపల్ చర్యలను తీవ్ర అవమానంగా భావించిన కొంతమంది విద్యార్థులు సాయంత్రం కాలేజీ సమయం ముగియగానే ముందుగా వెళ్లి మార్గమధ్యలో కాపుకాశారు. ప్రిన్సిపల్ అటుగా రాగానే ఆయనపై మూకుమ్మడిగా దాడి చేశారు. తుపాకీకి చూపించి చంపేస్తామని బెదిరించారు. అంతేకాక ప్రిన్సిపల్ జేబులో ఉన్న రూ.2200 లాక్కున్నారు. భయపడిపోయిన ప్రిన్సిపల్ శశి శేఖర్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. దీంతో విద్యార్థుల బ్యాచ్ అక్కడి నుంచి పరారీ అయింది. వెంటనే బాఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ప్రిన్సిపల్ విద్యార్థులపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై స్టేషన్ ఇన్ చార్జ్ రాజేశ్ పాండే మాట్లాడుతూ ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మహంత్ త్రివేణి పర్వత్ జూనియర్ కాలేజీ బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాకు కేవలం కిలో మీటరు దూరంలోనే ఉంటుందని తెలిపారు. అక్కడి నుంచే ఈ కాలేజీకి 40 శాతం మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారని, దాడి చేసిన వారిలో వాళ్లే ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.   


Similar News