జమ్మికుంట మండలం లో పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ఓ మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా మారగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలైన సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-03 06:40 GMT

దిశ, జమ్మికుంట: పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ఓ మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా మారగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలైన సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోరపల్లి గ్రామానికి చెందిన మద్దెర్ల అక్షర(3) అనే చిన్నారి బుధవారం రాత్రి ఆరు బయట ఆడుకుంటుండగా పిచ్చికుక్క విచక్షణ రహితంగా దాడి చేసింది. దీంతో చిన్నారి అక్షర పెదవికి తీవ్రంగా గాయం అయింది. చిన్నారి తో పాటు స్వరూప, వెంకటస్వామి, మరికొంతమంది చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేయడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. మరికొందరు పిచ్చికుక్క దాడి నుంచి తప్పించుకున్నారు. కాగా చిన్నారి అక్షర పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం హనుమకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అధికారులు స్పందించి గ్రామంలో కుక్కల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


Similar News