తెలుగు పత్రికా రంగంలో ‘దిశ’సంచలనం
తెలుగు పత్రికా రంగంలో ‘దిశ’ఒక సంచలనం అని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి : తెలుగు పత్రికా రంగంలో ‘దిశ’ఒక సంచలనం అని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దిశ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా వేగంతో, ప్రింట్ మీడియా విశ్వసనీయతతో ఎప్పటి వార్తలు అప్పుడే అందించడం దిశ ప్రత్యేకత అన్నారు. వార్తలను అత్యంత వేగంగా అందిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ‘దిశ’ డిజిటల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని ప్రశంసించారు.
పాఠకులకు తాజా వార్తలు అందించాలనే లక్ష్యంతో ‘దిశ’పరిచయం చేసిన డైనమిక్ ఎడిషన్స్ మీడియా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయని, ఇదే విధానాన్ని ఇతర సంస్థలు అనుసరించడం దిశ సక్సెస్ కు నిదర్శనంగా చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా ఉంటూ అనేక సమస్యలను కథనాల రూపంలో ప్రచురిస్తూ అధికారులు నాయకుల దృష్టికి తీసుకు వస్తున్న దిశ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు,పాఠకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల హరీష్ గౌడ్, రిపోర్టర్లు వెంకటరమణ, కేఎల్ రెడ్డి, నగేష్, గోవర్ధన్, కృష్ణ, నరహరి పాల్గొన్నారు.