మిల్లుల్లో ధాన్యం మాయం ?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల తీరు మారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు మారినా వారి పంతం నెగ్గించుకుంటున్నారు.

Update: 2024-12-28 02:12 GMT

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల తీరు మారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు మారినా వారి పంతం నెగ్గించుకుంటున్నారు. కొంతమంది మిల్లర్లు తమ అక్రమ దందాను సాగిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. పలుకుబడే ఆధారంగా ప్రభుత్వ సొమ్ముతో యథేచ్ఛగా వ్యాపారం విస్తరించుకుంటూ ప్రభుత్వాలనే శాసిస్తున్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మిల్లర్లను కట్టడి చేసేందుకు చట్టాలను సవరించినా మిల్లర్లు మాత్రం పాత పంథానే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించిన ధాన్యాన్ని ప్రైవేటుగా మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ దందాకు పుల్ స్టాప్ పడేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ధాన్యం మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఆ ధాన్యం ఇప్పుడు ఎక్కడా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా జమ్మికుంట పట్టణంలోని మూడు రైస్ మిల్లుల నిర్వాహకులు ఈ దందాకు కేంద్ర బిందువులుగా నిలుస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మిల్లర్లకు సీఎంఆర్ కోసం పంపించిన ధాన్యం మిల్లర్ల వద్దా ఉందా? మిల్లర్లు ప్రభుత్వం చెప్పిన సమయానికి సీఎంఆర్ పెడతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ బ్యూరో, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల తీరుమారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు మారినా వారి పంతం నెగ్గించుకుంటున్న కొంతమంది మిల్లర్లు తమ అక్రమ దందాను సాగిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. పలుకుబడే ఆధారంగా ప్రభుత్వ సొమ్ముతో యథేచ్ఛగా వ్యాపారం విస్తరించుకుంటూ ప్రభుత్వాలనే శాసిస్తున్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మిల్లర్లను కట్టడి చేసేందుకు చట్టాలను సవరించినా మిల్లర్లు మాత్రం పాత పంథానే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించిన ధాన్యాన్ని ప్రైవేటుగా మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ దందాకు పుల్ స్టాప్ పడేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మిల్లుల్లో ధాన్యం ఎక్కడ ?

ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేసినట్టు అధికారులు రికార్డు సృష్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా ఆ ధాన్యం ఇప్పుడు ఎక్కడా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా జమ్మికుంట పట్టణంలోని మూడు రైస్ మిల్లుల నిర్వాహకులు ఈ దందాకు కేంద్ర బిందువులుగా నిలుస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అధికారులే సూత్రధారులుగా వ్యవహరించడంతో మిల్లర్లు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి అధికారులు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంపినట్లుగా చూపించడంతో ఒక్క అడుగు ముందుకేసిన మిల్లర్లు ఇప్పుడు ఆ ధాన్యాన్ని మార్కేట్‌లో విక్రయించుకుని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మిల్లర్లకు సీఎంఆర్ కోసం పంపించిన ధాన్యం మిల్లర్ల వద్దా ఉందా ? మిల్లర్లు ప్రభుత్వం చెప్పిన సమయానికి సీఎంఆర్ పెడతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మిల్లర్ల అక్రమాలకు లోపం ఎక్కడా ?

ప్రభుత్వం ప్రజాధనంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లకు అప్పగిస్తే తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిన మిల్లర్లు ఎందుకు అప్పగించడం లేదనేది బహిరంగ రహస్యమే. అయినప్పటికీ సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతుంది. దీంతో లోపం ఎక్కడ అనేది సర్వత్రా వ్యక్తం అవుతున్న సందేహం గత ప్రభుత్వం తప్పిదాలను కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొదట్లోనే గుర్తించింది. అయినప్పటికీ మిల్లర్ల అక్రమాల్లో అధికారుల భాగస్వామ్యంతో అక్రమాల కట్టడి ప్రశ్నార్థకంగా మారింది. అధికారులే మిల్లర్ల అమ్యమ్యాలకు తలొగ్గి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్టవేయడం అనేది ప్రశ్నార్థకంగా మారింది.


Similar News