మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే : ట్రాఫిక్ ఎస్సై

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు కేసులు

Update: 2024-12-28 14:23 GMT

దిశ, సుల్తానాబాద్: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు జైలుకు పంపడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ రవికాంత్ తెలిపారు. శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాఫిక్ సీఐ అనిల్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి, వాహనాల పత్రాలను పరిశీలించారు. రాంగ్ రూట్లో ప్రయాణాలు నేరమని , వాహనదారులు రాంగ్ రూట్లో దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనాలకు సంబంధించి అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు, వాహనాలు నడిపేటప్పుడు మెల్లగా వెళ్లాలని, అతి వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడిన కుటుంబ పరంగా,ఆర్థికపరంగా నష్టపోతారని అన్నారు , వాహనాలు జాగ్రత్తగా నడిపి గమ్యం చేరుకోవాలని వాహనదారులకు సూచించారు. ఎస్సై రవికాంత్ వెంట ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.


Similar News