నిజాలను నిర్భయంగా రాయడంలో దిశది ప్రత్యేక శైలి

నిజాలను నిర్భయంగా రాయడంలో దిశ దిన పత్రిక శైలి వేరు అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు.

Update: 2024-12-27 10:47 GMT

దిశ,వేములవాడ : నిజాలను నిర్భయంగా రాయడంలో దిశ దిన పత్రిక శైలి వేరు అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా దిశ 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఎలాంటి సంఘటన జరిగిన క్షణాల్లో విషయాన్ని పాఠకుల ముందుకు చేర్చడంలో దిశ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని అన్నారు.

    ముఖ్యంగా పోలీస్ శాఖ తరపున నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలను డిజిటల్ మీడియాతో పాటు పత్రికలో త్వరితగతిన ప్రచురించి సమాజంలో పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు దిశ ఎంతో కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లోనూ ఇదే పంథాను కొనసాగిస్తూ దిశ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధి నీరటి నవీన్ కుమార్ (నాని), వేములవాడ ఆర్సీ ఇంచార్జీ మారుపాక శ్రీహరి, టౌన్ రిపోర్టర్ యెనుగంటి రామ్మోహన్, ఆయా మండలాల ప్రతినిధులు రాజురి విష్ణు, పీసరి కిషన్, గండి నరేష్, ఒగ్గు బాల్ రాజు, గుడికాడి శ్రీకాంత్, దుబ్బాక రాజు పాల్గొన్నారు. 


Similar News