దారుణంగా గాయపరిచి దోపిడీకి పాల్పడుతున్న దొంగల అరెస్ట్

దారుణంగా గాయపరచి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను హనుమకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు

Update: 2024-10-02 10:29 GMT

దిశ, హనుమకొండ : దారుణంగా గాయపరచి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను హనుమకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి పోలీసులు తొమ్మిది వందల నగదు , ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో జన్ను రాజ్ కుమార్, కట్కురి యాకుబ్, కట్కురి రేణుక వరంగల్ కు చెందిన వారిగా గుర్తించడం జరిగిందని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

దేవన్నపేట ప్రాంతానికి చెందిన బాధితుడు గడిచిన సెప్టెంబర్ ముప్పై వ తారీకున మధ్యాహ్న సమయంలో దేవన్నపేట కు వెళ్లేందుకు ఆటో కోసం గోపాల్ పూర్ క్రాస్ రోడ్డు వద్ద వేచి ఉన్నాడు. నిందితులు ముగ్గురు ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి బాధితుడిని తీవ్రంగా కొట్టి గుర్తు తెలియని ఆటోలో పోచమ్మ కుంట శ్మశాన వాటిక వద్దకు తీసుకపోయి అక్కడ మరో మారు తీవ్రంగా కొట్టి అతని వద్ద ఉన్న పదివేల రూపాయలు, ఒక సెల్ ఫోన్ ను దోచుకోవడంతో పాటు బాధితుడి గూగుల్ పే నుండి మరో వెయ్యి రూపాయలు నిందితులు తమ ఖాతాలోకి డబ్బులను బదిలీ చేయించుకున్నారని తెలిపారు. అనంతరం నిందితులు ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకొని పోయారు.

బాధితుడు హనుమకొండ కొండ పోలీసు స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం హనుమకొండ బస్ స్టాండ్ లో నిందితులను అరెస్టు చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ సతీష్ , ఎస్. ఐ సతీష్ , హెడ్ కానిస్టేబుల్ రాహూఫ్ , కానిస్టేబుల్ గౌస్ పాషా ను ఏసీపీ అభినందించారు.


Similar News