నల్లబెల్లి మండలం లో పులి సంచారం

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగుడెం పరిసర గ్రామాల్లోని పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు.

Update: 2024-12-27 11:59 GMT

దిశ,నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగుడెం పరిసర గ్రామాల్లోని పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. శుక్రవారం ఉదయం పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు పులి అడుగులను గుర్తించారు. భయాందోళనకు గురైన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ పంట పొలాల్లో ఉన్న అడుగులను పరిశీలించి అవి పులి అడుగులే అని నిర్ధారించారు. పులి సంచారం నిజమే అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించడంతో స్థానిక ఎస్సై గోవర్ధన్ రుద్రగూడెం గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులు త్వరగా ముగించుకొని చీకటి పడకముందే ఇళ్లకు చేరుకోవాలని గ్రామాల్లో దండోరా వేయించారు.


Similar News